హైదరాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామ ఫార్మా కంపెనీ కోసం గిరిజన లంబాడి బిడ్డల భూములను అక్రమంగా వారి దగ్గర నుండి లాక్కొని చిత్ర హింసలు గురి చేస్తూ..మనోభావాలను దెబ్బతీస్తూ విరుచుకు పడడం అమాయక లంబాడి బిడ్డలపై పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడం మా గిరిజన లంబాడి జాతి మనసు కలిసి వేస్తుందని లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్ వాపోయారు. ప్రభుత్వ హేయమైన చర్యకు నిదర్శనమిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే అక్కడ జరిగిన పరిణామాల గురించి పోలీస్ వ్యవస్థ తప్పు చేసినవారికి అధికారులకు వ్యతిరేకంగా వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు తప్పు చేసిన వారిని వదిలిపెట్టి అమాయక ప్రజల పైన ప్రతాపం చూపడం మానుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన వారికి వెంటనే విడుదల చేయాలని లేనియెడల గిరిజన లంబాడీలు ప్రతి ఒక్కరు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి,ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ నాయక్,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బానోత్ హరిష్ నాయక్,నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ నాయక్,జిల్లా ఉపాధ్యక్షులు లకావత్,వీరన్న నాయక్,తుంగతుర్తి అధ్యక్షులు రమేష్ నాయక్, శ్రీను నాయక్,మోహన్ నాయక్,సంజీవ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from expresstelugudaily.com
Subscribe to get the latest posts sent to your email.