మహబూబాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: బిర్సముండా జయంతి అధికారిక వేడుకలకు గిరిజన సంఘాలను ఆహ్వానించకపోవడం దారుణం అని గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు కిషన్ నాయక్,లంబాడి హక్కుల పోరాట సంఘం ఎల్.హెచ్.పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్,లు అన్నారు.నిరంతరం ప్రజా సమస్యల పై కొట్లడుతున్న నిజమైన ఉద్యమకారులను పిలవకుండా, అధికారులతో కుమ్మక్కు అయ్యే సంఘాలను పిలిచి బిర్స ముండా జయంతి జరపడం హేయమైన చర్య అని మహబూబాబాద్ లో ఎల్.హెచ్.పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడా రమేష్ నాయక్,అధ్యక్షతన గిరిజన సంఘాలు మండిపడ్డాయి. గిరిజన శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల పై నిరంతరం ప్రశ్నిస్తున్న నేతలు రావొద్దని నెపంతో ముందస్తు ప్రణాళికతో నామమాత్ర సంఘాలను పిలిచి జరుపుకున్నారు అని,అక్రమ బిల్లులు పెట్టుకొని జేబు నింపుకోవాలని, మాలాంటి ఉద్యమకారులు వస్తె నిలదీస్తారని కుట్రతో పిలవలేదని కిషన్ నాయక్,భీమా నాయక్ అన్నారు.గిరిజన శాఖలో అనేక అవినీతి ఆరోపణలు గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న విషయం జిల్లా ప్రజానీకాన్ని తెల్సిన విషయమే కానీ ఇప్పటి వరకు గిరిజన శాఖను ప్రక్షాళన చేయకపోవడం సిగ్గు చేటు అని అన్నారు.గిరిజన శాఖ డిడిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్.హెచ్.పీఎస్ పార్లమెంట్ ఇంఛార్జి, రాందాస్ నాయక్,గూడూరు మండల అధ్యక్షులు రామచంద్ర నాయక్, రాంబాబు నాయక్,మహిళా అధ్యక్షురాలు లక్ష్మీబాయి,శ్రీనివాస్ నాయక్,రాంజీ నాయక్,సంతోష్ నాయక్,బుజ్జి బాయ్,తదితరులు పాల్గొన్నారు.
Discover more from expresstelugudaily.com
Subscribe to get the latest posts sent to your email.