Thursday, November 21, 2024
Homeతెలంగాణటిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

:జిల్లాలో 29 కేంద్రాలు ఏర్పాటు పరీక్షకు హాజరైతున్న అభ్యర్థులు 10,255 అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి:అభ్యర్థులను ఉదయం 9.00 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.అభ్యర్థులు ఒరిజినల్ ఐడీలతో పరీక్ష కేంద్రం కు రావాలి.అభ్యర్థులుఎట్టి పరిస్థితుల్లోనూ తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదు.పరీక్షా కేంద్రాల లో ఆన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి,ఆర్టీసీ,బస్ సకాలం లో బస్ సౌకర్యం కల్పించాలి,హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి:జిల్లా పాలనాధికారి రాజర్షి షా,ఈ నెల నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించనున్న టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఆన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అధికారులను ఆదేశించారు.గురువారం టిజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్,స్ట్రాంగ్ రూమ్,జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్,డిఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్ తో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ..తేది 17.11.2024 నఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం12.30గంటల వరకు పేపర్1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష ( పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారు), సాయంత్రం 3.00 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పోలిటి అండ్ సొసైటీ పరీక్ష ( పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుందని, తేది 18.11.2024 న ఉదయం 10.00 గంటలనుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష( పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు మూసివేస్తారు) ఉంటుందని తెలిపారు. టిజిపిఎస్సి గ్రూప్ -3 పరీక్షలు సజవుగా,ప్రశాంత వాతావరణం లో జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులెవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని స్పష్టం చేశారు. జిల్లాలో 10,255 మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్3 పరీక్ష రాస్తున్నారని వీరి కోసం 29 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.రూట్ ఆఫీసర్. 529 మంది శాఖల అధికారులు లైన్ స్కాడ్స్. 10రూట్ ఆఫీసర్, జాయింట్ రూట్ ఆఫీసర్. 10Pwd 1. ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ , భూక్త పూర్అభ్యర్థులు (i) నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్నులు (ii) పెన్సిల్ & ఎరేజర్ (i) హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫోటో (iv) ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ID కార్డ్‌ని మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లాలి. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే వ్రాయాలన్నారు.సెల్ ఫోన్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా , త్రాగు నీరు,ఫర్నిచర్,శానిటేషన్,తదితర ఏర్పాట్లు చేయాలని, ఫ్యాన్లు,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని నియమించాలని ఆన్నారు.ఆర్టీసీ ద్వారా సమయానుసారంగా బస్సులు నడిపించాలని,తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 144 సెక్షన్ అమలు , జిరాక్స్ సెంటర్లను మూసివేయడం, అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, పరీక్ష సాగుతున్న సమయంలో ప్రతి అరగంటకు ఒకసారి షార్ట్ బెల్, పరీక్ష ముగిసే 5 నిమిషాల ముందు షార్ట్ బెల్, పరీక్ష ముగిసే సమయానికి లాంగ్ బెల్ మోగిస్తారని తెలిపారు.ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, అదనపు ఎస్పీ సురేందర్,డీఎస్పీ జీవన్ రెడ్డి,ఆర్ సీఓ జాగ్రం అంతర్ బెది,ఆర్డీఓ వినోద్ కుమార్,జాయింట్ కస్టోడియన్, చీఫ్ సూపరెండెంట్లు, ఆయా శాఖల అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, తదితరులు పాల్గొన్నారు.


Discover more from expresstelugudaily.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page