జహీరాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: గిరిజన జన సమితి సంఘం వ్యవస్థాపకులు వినోద్ నాయక్, ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.గిరిజన జన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కేతావత్ ధర్మ నాయక్,ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ధర్మ నాయక్, మాట్లాడుతూ..మన జాతి కోసం కష్టపడి పనిచేసే ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకు చేరాలని వారు యువతను కోరడం జరిగింది.మన జాతి కోసం సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో నడుచుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన జన సమితి రాష్ట్ర అధ్యక్షులు వినోద్ నాయక్ పాల్గొనడం జరిగింది.అదే విధంగా జహీరాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షుడిగా చావాన్ శంకర్,అసెంబ్లీ వైస్ ప్రసిడెంట్ గా పవర్ పుల్సింగ్,జహీరాబాద్ టౌన్ ప్రసిడెంట్ గా కిషన్ చౌహన్,టౌన్ జనరల్ సెక్రెటరీగా రాథోడ్ అరుణ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ రాథోడ్,లను ఎన్నుకొనడం జరిగింది అని వ్యవస్థపలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Discover more from expresstelugudaily.com
Subscribe to get the latest posts sent to your email.